ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    గాంధీభవన్‌కు జనగామ సేవాదళ్ నేతలు

    • ఓటు చోరీ’పై సత్యాగ్రహ దీక్షకు తరలిన నాయకులు, కార్యకర్తలు
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు5 అక్టోబర్, 202607:26 AM
    గాంధీభవన్‌కు జనగామ సేవాదళ్ నేతలు
    జనగామ, అక్టోబర్‌ 5, ప్రజాధ్వని: తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ సేవాదళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్‌ పిలుపు మేరకు జనగామ జిల్లా సేవాదళ్‌ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు తరలివెళ్లారు. ‘ఓటు చోరీ’ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో గాంధీభవన్‌లో నిర్వహిస్తున్న సత్యాగ్రహ దీక్షలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సేవాదళ్‌ నాయకులు పిలుపునిచ్చారు. జనగామ జిల్లా సేవాదళ్‌ అధ్యక్షుడు జాయ మల్లేష్‌ ఆధ్వర్యంలో జిల్లా నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గాంధీభవన్‌కు బయలుదేరారు. ఈ సందర్భంగా దాసరి శ్రీనివాస్‌రెడ్డి, లింగాల వెంకటరెడ్డి, రాపోకల ఉప్పలయ్య అడ్వకేట్‌, కటకం ఉదయ్‌కుమార్‌, దండిగా ఐలయ్య, మెంతేనే కిష్టయ్య, మోటే మల్లేష్‌, మొగ్గం కృష్ణంరాజు, మల్ల శ్రీనివాస్‌, మారపాక యాకయ్య, తాండ్ర కమలాకర్‌, లకావత్‌ అతిరం, గాదెపాక శ్రీధర్‌, గుగులోత్‌ కిషన్‌నాయక్‌, పారుపల్లి ప్రభాకర్‌రెడ్డి, సుంకరి శ్రీనివాస్‌రెడ్డి, ఆదినారాయణ, సుందర్‌ శ్రీనివాస్‌, బిర్రు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా, డివిజన్‌, నియోజకవర్గ, మండల, పట్టణ, గ్రామ, వార్డు స్థాయి నాయకులు, కార్యకర్తలు గాంధీభవన్‌కు తరలివెళ్లారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు అంశాలపై కాంగ్రెస్‌ నిర్వహిస్తున్న ఆందోళనల్లో సేవాదళ్‌ శ్రేణులు భాగస్వాములు అవుతున్నాయి.
    మీ స్పందన:

    షేర్ చేయండి: