ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    చిల్పూర్ లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు24 ఏప్రిల్, 202606:15 AM
    చిల్పూర్ లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
    చిల్పూర్, ఏప్రిల్ 24: రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తత నెలకొల్పిన ఘటనగా, చిల్పూర్ మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ డాక్టర్ రాజయ్య ఆదేశాల మేరకు, బీఆర్ఎస్ చిల్పూర్ మండల పార్టీ ఇంచార్జి మాలోతు రమేష్ నాయక్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
    చిల్పూర్ లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం - అదనపు చిత్రం 1
    నర్సంపేటలో ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మాహుతి ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, కార్మికులకు సంఘీభావంగా ఈ నిరసన చేపట్టినట్లు నాయకులు తెలిపారు. మృతుడి కుటుంబానికి రూ.1 కోటి ఎక్స్గ్రేషియా, అలాగే ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొన్న వారు, ఈ మేరకు చిల్పూర్ ఎంఆర్వోకు వినతిపత్రం సమర్పించారు.
    చిల్పూర్ లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం - అదనపు చిత్రం 2
    ఈ కార్యక్రమంలో మార్కెట్ మాజీ డైరెక్టర్ బత్తుల రాజన్ బాబు, ఉప సర్పంచ్ రాజరాపు రంజిత్, నారగోని రాజు, శ్రీను, మాజీ సర్పంచ్ దివాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: