ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    మండల వార్తలు

    చిల్పూర్ మండల వార్డ్ మెంబర్స్ ఫోరం ఇన్‌చార్జిగా వడ్డేపల్లి పవన్

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు8 అక్టోబర్, 202610:04 AM
    చిల్పూర్ మండల వార్డ్ మెంబర్స్ ఫోరం ఇన్‌చార్జిగా వడ్డేపల్లి పవన్
    చిల్పూర్ అక్టోబర్ 08 ప్రజాధ్వని: చిల్పూర్ మండల వార్డ్ మెంబర్స్ ఫోరం మండల ఇన్‌చార్జిగా వడ్డేపల్లి పవన్‌ను నియమించారు. తెలంగాణ రాష్ట్ర వార్డ్ మెంబర్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు నాగబెల్లి జ్యోతి మహేష్ ఆదేశాల మేరకు జనగాం జిల్లా ఇన్‌చార్జి చెప్యాల మహిపాల్ రెడ్డి, కో-ఇన్‌చార్జి గుండేటి రామచందర్ గౌడ్, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి నాగబండి సంతోష్ ఆధ్వర్యంలో ఈ నియామకం చేపట్టారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి పవన్ మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల వార్డ్ మెంబర్లను సమన్వయం చేసుకుంటూ ఫోరంను బలోపేతం చేస్తానన్నారు. వార్డ్ మెంబర్లు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వార్డ్ మెంబర్లు మరింత చురుగ్గా స్పందించి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. వార్డ్ మెంబర్ల హక్కులు, విధులు, సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిల్పూర్ మండలంలోని వివిధ గ్రామాల నుంచి పలువురు వార్డ్ మెంబర్లు పాల్గొన్నారు. ఫోరం బలోపేతం, వార్డ్ మెంబర్ల సమస్యలు, గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చించారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: