ఆర్టీఐ పరిరక్షణ కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా గోపాల్ దాస్ ఉపేందర్
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు25 జులై, 202602:48 AM

జనగామ, జూలై 24 (ప్రజాధ్వని): సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జనగామ జిల్లా లింగాలఘనపూర్ మండలం కుందారం గ్రామానికి చెందిన గోపాల్ దాస్ ఉపేందర్ నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎలిగేండ్ల వెంకటేష్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఉపేందర్ మాట్లాడుతూ.. తనపై విశ్వాసం ఉంచి రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన సంస్థ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, జాతీయ ఉపాధ్యక్షుడు ఏటి ఆంజనేయులు, రాష్ట్ర అధ్యక్షుడు ఎలిగేండ్ల వెంకటేష్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సంస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందేలా ప్రజలతో కలిసి పనిచేస్తానని తెలిపారు. ప్రజాధనాన్ని పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్న ఆయన.. ప్రభుత్వం విడుదల చేసే ప్రతి రూపాయి నిజమైన లబ్ధిదారులకు చేరేలా కృషి చేస్తానన్నారు. సంక్షేమ పథకాల అమలులో అవినీతి, అక్రమాలు చోటుచేసుకుంటే ప్రజల పక్షాన నిలబడి పోరాడుతానని స్పష్టం చేశారు.
