ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    మండల వార్తలు

    శ్రీపతిపల్లి పాఠశాలలో ఆకస్మిక తనిఖీ

    • మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించిన టాస్క్ ఫోర్స్
    • కిచెన్, డైనింగ్ హాల్ లో హైజీన్ పై ఆరా
    • మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ఆదేశం
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు23 సెప్టెంబర్, 202604:38 AM
    శ్రీపతిపల్లి పాఠశాలలో ఆకస్మిక తనిఖీ
    చిల్పూర్ సెప్టెంబర్ 23 ప్రజాధ్వని :మండలంలోని శ్రీపతిపల్లి ప్రభుత్వ పాఠశాలలో డివిజన్ స్థాయి టాస్క్ ఫోర్స్ అధికారి బి. రవీందర్ ఆధ్వర్యంలోని బృందం సోమవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించింది.పాఠశాలకు చేరుకున్న అధికారులు నేరుగా వంటగది (కిచెన్) లోకి వెళ్లి పరిశీలించారు. వంటగదిలో పరిశుభ్రత, బియ్యం, పప్పు నిల్వలు, వంట సామాగ్రిని పరిశీలించారు. అనంతరం కొత్తగా నిర్మించిన డైనింగ్ హాల్ ను పరిశీలించారు. డైనింగ్ హాల్ నిర్మాణ వివరాలను హెడ్మాస్టర్ ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు వడ్డించిన అన్నం, పప్పు, సాంబారు రుచి, నాణ్యతను స్వయంగా పరిశీలించారు. విద్యార్థులను నేరుగా అడిగి మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? రోజూ గుడ్డు, కూరగాయలు ఇస్తున్నారా? అని ఆరా తీశారు. అనంతరం మధ్యాహ్న భోజన సిబ్బంది, ఉపాధ్యాయులతో మాట్లాడుతూ.. తప్పనిసరిగా ప్రభుత్వ మెనూ పాటించాలి అని పేరొన్నారు. పరిశుభ్రత (హైజీనిక్ ఫుడ్) పాటించాలని, విద్యార్థులు భోజనానికి ముందు నీట్ గా హ్యాండ్ వాష్ చేస్తున్నారా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు పరిశుభ్రమైన తాగునీరు అందించాలని ఆదేశించారు.ఈ తనిఖీలో మిడ్ డే మీల్స్ ఇన్చార్జి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: