ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    రైతు డిక్లరేషన్‌ను కాంగ్రెస్ తుంగలో తొక్కింది: తొలి ఉప ముఖ్యమంత్రి డా. రాజయ్య

    • ఈ నెల 29న జనగాంకు రానున్న కేటీఆర్
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు20 జూన్, 202608:36 AM
    రైతు డిక్లరేషన్‌ను కాంగ్రెస్ తుంగలో తొక్కింది: తొలి ఉప ముఖ్యమంత్రి డా. రాజయ్య
    స్టేషన్ ఘనపూర్, జూన్ 20 ప్రజాధ్వని : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే డా. తాటికొండ రాజయ్య ఆరోపించారు. శనివారం స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌లో రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, అన్ని పంటలకు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం కేంద్రం కొనమన్న పంటనే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పడం రైతులను మోసం చేయడమేనన్నారు. 40 లక్షల మంది రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని ప్రకటించి, పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. రైతు భరోసా, కౌలు రైతులకు ఆర్థిక సాయం, భూమిలేని రైతులకు మద్దతు వంటి హామీలు కూడా సక్రమంగా అమలు కాలేదన్నారు. వరి ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం కారణంగా రైతులు నష్టపోయారని, పెద్దఎత్తున ధాన్యం మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో రైతు పండించిన పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేసి, యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతు సమస్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. అలాగే ఈ నెల 29న జనగాంలో జరిగే బీఎల్ఏ శిక్షణ కార్యక్రమానికి కేటీఆర్ హాజరవుతారని, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని రాజయ్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చింతకుంట్ల జగన్ రెడ్డి, జఫర్ఘడ్ పల్లెపాటి జయపాల్ రెడ్డి, చిల్పూర్ మండలం ఇంచార్జ్ మాలతు రమేష్ నాయక్, రఘునాథ్ పల్లి మండల ఇంచార్జ్ ముసిపట్ల విజయ్, ఆకుల కుమార్, చందర్ రెడ్డి, మండల కోఆర్డినేటర్ రాజకుమార్,మారపల్లి ప్రసాద్, ఆకారపు అశోక్, చుక్క రాజేష్,ప్రవీణ్,తదితరులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: