ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    అసెంబ్లీ ముట్టడికి పిలుపు.. ఆశా వర్కర్ల ముందస్తు అరెస్టు

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు11 సెప్టెంబర్, 202611:14 AM
    అసెంబ్లీ ముట్టడికి పిలుపు.. ఆశా వర్కర్ల ముందస్తు అరెస్టు
    స్టేషన్‌ఘనపూర్‌ సెప్టెంబర్ 11 ప్రజాధ్వని : ఆశా వర్కర్ల సమస్యలు, డిమాండ్ల పరిష్కారం కోసం అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు శుక్రవారం ఉదయం పలువురు ఆశా వర్కర్లను ముందస్తుగా అరెస్టు చేశారు. వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ‘పారితోషికం వద్దు.. రూ.18 వేల కనీస వేతనం ముద్దు’ అంటూ నినదించారు. 24 గంటలు ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తున్న తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న తమను ముందస్తుగా అరెస్టు చేయడం ప్రభుత్వ పిరికిపంద చర్య అని విమర్శించారు. రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. శాంతియుత ఆందోళనకు వెళ్లకుండా ఇళ్లకు వచ్చి అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. ప్రభుత్వం తమ హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. అరెస్టయిన వారిలో తాటికొండ మీరిలా, సట్ల రమ, లావణ్య, గుర్రం అనిత, గుర్రం సరోజన, స్వప్న, గారెళ్లి స్వప్న, తాళ్లపెళ్లి జ్యోతి, సరస్వతి, నీల జయంతి, సీహెచ్‌ యాదలక్ష్మి తదితరులు ఉన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: