ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడిగా కొమరయ్య (డేవిడ్‌)

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు14 సెప్టెంబర్, 202608:49 AM
    కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడిగా కొమరయ్య (డేవిడ్‌)
    జాఫర్‌గడ్‌ సెప్టెంబర్ 14 ప్రజాధ్వని : జనగామ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడిగా జాఫర్‌గడ్‌ మండలం ఉప్పుగల్లు గ్రామానికి చెందిన బొందుగుల కొమరయ్య (డేవిడ్‌) నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షులు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కొమరయ్య (డేవిడ్‌) మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్‌ పార్టీ పెద్దలకు, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి సింగపురం ఇందిర తనకు వెన్నుదన్నుగా నిలుస్తూ అందిస్తున్న సహాయ సహకారాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తానని, కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు ఎస్సీ వర్గాల అభ్యున్నతికి తనవంతు కృషి చేస్తానని కొమరయ్య పేర్కొన్నారు. కొమరయ్య నియామకం పట్ల స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: