ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం

    • ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న ధరావత్ రాజుకు అభినందనల వెల్లువ
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు8 సెప్టెంబర్, 202611:17 AM
    రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం
    స్టేషన్‌ఘన్‌పూర్ సెప్టెంబర్ 08 ప్రజాధ్వని : రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికై ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకున్న ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల స్కూల్ అసిస్టెంట్, హిందీ ఉపాధ్యాయుడు ధరావత్ రాజును ఘనంగా సన్మానించారు. స్టేషన్‌ఘన్‌పూర్ మునిసిపాలిటీ పరిధిలోని పాఠశాలలో బీఆర్‌ఎస్‌వీ నియోజకవర్గ ఇన్‌చార్జి లకావత్ చిరంజీవి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజుకు శాలువా కప్పి, పూలబోకే అందజేసి అభినందించారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చేతుల మీదుగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకోవడం స్టేషన్‌ఘన్‌పూర్ ప్రాంతానికే గర్వకారణమని లకావత్ చిరంజీవి అన్నారు. ఉపాధ్యాయ వృత్తిని కేవలం ఉద్యోగంగా కాకుండా సేవా బాధ్యతగా భావిస్తూ విద్యార్థుల భవిష్యత్తు కోసం ధరావత్ రాజు అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. విద్యార్థులకు విద్యాబోధనతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఆయన చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మంచి ఉపాధ్యాయుడి సేవలు తరగతి గదికే పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ధరావత్ రాజుకు లభించిన రాష్ట్రస్థాయి పురస్కారం భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో విద్యారంగానికి సేవలందించేందుకు ప్రేరణగా నిలవాలని ఆకాంక్షించారు. ఆయన సేవలు ఇతర ఉపాధ్యాయులకు సైతం స్ఫూర్తిదాయకమని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకుని విద్యారంగంలో విశిష్ట సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్‌మాస్టర్ బైరీ సురేందర్ రెడ్డి, ఉపాధ్యాయుడు బి. వాసు, ముదిరాజ్ యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంటాల యాదగిరి, విద్యార్థి నాయకులు గుండె రంజిత్, బానోత్ తిరుపతి, రమేష్, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
    రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం - అదనపు చిత్రం 2
    మీ స్పందన:

    షేర్ చేయండి: