వినాయక నిమజ్జన ఏర్పాట్లపై సమీక్ష
- విద్యుత్ శాఖ రివ్యూ, రాజవరం సెక్షన్ లో DE సమీక్ష
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు21 సెప్టెంబర్, 202602:34 PM

చిల్పూర్ 21 సెప్టెంబర్ ప్రజాధ్వని: వినాయక నిమజ్జన ఏర్పాట్ల నేపథ్యంలో రాజవరం సెక్షన్ లో విద్యుత్ శాఖ DE బి. సారయ్య అధికారులతో ప్రత్యేక రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాజవరం సెక్షన్ పరిధిలో జరగనున్న వినాయక నిమజ్జన ఊరేగింపుల దృష్ట్యా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై సమీక్షించారు.నిమజ్జనం రూట్ లో వేలాడుతున్న విద్యుత్ తీగలను వెంటనే సరిచేయాలని, శోభాయాత్ర సమయంలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని, నిమజ్జన ప్రాంతంలో తాత్కాలిక విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా నిమజ్జనం రోజు 24 గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా భద్రతా ప్రమాణాలు పాటించాలని, పోలీస్, పంచాయతీ,రెవెన్యూ శాఖలతో సమన్వయంగా పని చేయాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో AE, లైన్ మెన్ లు, సెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు.
