ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    కాంగ్రెస్ పార్టీ (స్టే,ఘ) ఇంచార్జి సింగపురం ఇందిరా ప్రత్యేక ధన్యవాదాలు: శాగంటి మణి

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు5 మే, 202605:41 AM
    కాంగ్రెస్ పార్టీ (స్టే,ఘ) ఇంచార్జి సింగపురం ఇందిరా ప్రత్యేక ధన్యవాదాలు: శాగంటి మణి
    కాంగ్రెస్ పార్టీ జనగాం జిల్లా కమిటీలో నష్కల్ గ్రామానికి చెందిన శాగంటి మణిందర్‌కు సెక్రటరీగా అవకాశం కల్పించినందుకు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సింగపురం ఇందిరాతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కోసం గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సైనికుడిలా పనిచేస్తానని శాగంటి మణి పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో చిల్పూర్ మండల బీసీ సెల్ అధ్యక్షుడు కలకొల్లు బాలరాజు, వెంకటేశ్వరపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు శివరాజ్ మహేందర్ పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: