బహుజన రాజ్యాధికారమే బీఎస్పీ లక్ష్యం: జలగం ప్రవీణ్
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు3 అక్టోబర్, 202606:58 AM

స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్ 3 ప్రజాధ్వని: బహుజనుల ఐక్యత, రాజకీయ చైతన్యం, రాజ్యాధికార సాధనే లక్ష్యంగా బీఎస్పీ ముందుకు సాగుతోందని జనగామ జిల్లా నాయకుడు జలగం ప్రవీణ్ అన్నారు. అక్టోబర్ 9న బడంగ్‌పేట్‌లో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహుజన రాజ్యాధికార సమరభేరి సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలో నియోజకవర్గ నాయకుడు గుర్రం కుమారస్వామి ఆధ్వర్యంలో శనివారం సమరభేరి సభకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జలగం ప్రవీణ్ మాట్లాడుతూ.. మాన్యవర్ కాన్షీరాం చూపిన మార్గంలో బహుజన వర్గాలను సంఘటితం చేస్తూ సామాజిక, రాజకీయ చైతన్యాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. బహుజనుల ఐక్యతతోనే తమ హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యంపై మరింత అవగాహన పెంపొందించుకోవచ్చని పేర్కొన్నారు. బహుజన వర్గాల ప్రజలు తమ సామాజిక, రాజకీయ హక్కులపై అవగాహన పెంచుకోవాలని ప్రవీణ్ సూచించారు. సమాజంలో సమానత్వం, రాజకీయ ప్రాతినిధ్యం, హక్కుల సాధన వంటి అంశాలపై చర్చించేందుకు సమరభేరి సభ వేదికగా నిలుస్తుందని బీఎస్పీ నాయకులు తెలిపారు. తెలంగాణలో బహుజన రాజ్యాధికార సాధన దిశగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
