ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    దసరా రోజు నాపై హత్యాయత్నం చేశారు

    • పాత కక్షలతో దాడి చేసి, కారు ధ్వంసం చేశారు బాధితుడు కావేరి వినయ్ ఆరోపణ
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు26 అక్టోబర్, 202602:20 AM

    దసరా పండుగ రోజున పాత కక్షల నేపథ్యంలో తనపై హత్యాయత్నం జరిగిందని స్టేషన్‌ ఘన్‌పూర్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ (తెలంగాణ రక్షణ సేన) నాయకుడు కావేరి వినయ్ ఆరోపించారు.

    దసరా రోజు నాపై హత్యాయత్నం చేశారు
    స్టేషన్‌ ఘన్‌పూర్‌, అక్టోబరు 25 (ప్రజాధ్వని): దసరా పండుగ రోజున పాత కక్షల నేపథ్యంలో తనపై హత్యాయత్నం జరిగిందని స్టేషన్‌ ఘన్‌పూర్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ (తెలంగాణ రక్షణ సేన) నాయకుడు కావేరి వినయ్ ఆరోపించారు. ఉప్పుగల్లు గ్రామానికి చెందిన బేతి రాజిరెడ్డి, బేతి రాకేష్‌రెడ్డిలు తనపై దాడి చేసి, కారును ధ్వంసం చేశారని తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో ఘటన వివరాలను వెల్లడించారు. వినయ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. దసరా రోజు తన స్నేహితుడిని ఉప్పుగల్లు గ్రామంలో దింపేందుకు కారులో వెళ్తుండగా, గ్రామంలోని ఎల్లమ్మ ఆలయం సమీపంలో బేతి రాజిరెడ్డి, బేతి రాకేష్‌రెడ్డిలు తన వాహనాన్ని అడ్డుకున్నారని పేర్కొన్నారు. అనంతరం పాత కక్షలను మనసులో పెట్టుకొని తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని, కారును ధ్వంసం చేశారని ఆరోపించారు. ఆయుధాలతో దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. అదే సమయంలో అటుగా వస్తున్న పోలీసు పెట్రోలింగ్‌ సిబ్బంది నిందితులను అడ్డుకోవడంతో తాను ప్రాణాపాయం నుంచి బయటపడ్డానని వినయ్‌ పేర్కొన్నారు. పోలీసుల సకాలంలో జోక్యం చేసుకోకపోతే తన ప్రాణాలకే ముప్పు వాటిల్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాడిలో గాయపడిన తాను ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై జఫర్‌ఘడ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిపారు. తనపై దాడికి పాల్పడిన వారిపై సమగ్ర విచారణ జరిపి, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కావేరి వినయ్‌ అధికారులను కోరారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: